Top 10 viral news 🔥
కుటుంబంపై దాడి చేసి ఇద్దరిని చంపిన ఏనుగులు
ఛత్తీస్గఢ్లో మరోసారి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం తెల్లవారుజామున సూరజ్ పూర్ జిల్లా ప్రేమ్ నగర్ ప్రాంతంలోని చిట్ఖాయ్ గ్రామంలో ఓ కుటుంబంపై దాడి చేసి ఇద్దరిని చంపాయి. గాఢనిద్రలో ఉన్న ఇద్దరు చిన్నారుల్ని తొక్కి చంపేశాయి. తల్లిదండ్రులు ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన చిన్నారులను బిసు పండో(11), కాజల్ (5)గా గుర్తించారు.