మాజీ ఎంపీకి షాక్.. బెయిల్ నిరాకరణ
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై నిర్ణయాన్ని నెల రోజుల క్రితం రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పును వెల్లడిస్తూ ప్రజ్వల్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.