పాలకుర్తి : సోమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీసోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జనగామ జిల్లా ఆదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ స్వయంభు సోమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. మంగళవారం ధనుర్మాసం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమం అనంతరం ఆలయ అర్చకులు డివిఆర్ శర్మ పట్టు వస్త్రాలతో సన్మానించి ప్రసాదాలను అందించారు.