హన్మకొండ: ప్రతిభను ప్రదర్శించి క్రీడాకారులు ఉన్నతస్థాయికి ఎదుగాలి
క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి రాష్ట్ర స్థాయి క్రీడల్లో విజయం సాధించి ఉన్నత స్థాయికి ఎదుగాలని తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ ఆయిల్ పెడ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి అన్నారు. ఆదివారం ఉమ్మడి వరంగల్ హన్మకొండ జిల్లా కేంద్రంలోని జహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఖో ఖో రాష్ట్ర స్థాయి బాలబాలికల జట్టు ఎంపిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.