నర్సంపేట: తల్లి బిడ్డలు కనిపించడం లేదని ఫిర్యాదు
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదాన్నపేట గ్రామానికి చెందిన తల్లి గణిపాక సంధ్యారాణి(35), కూతురు గణిపాక తేజ (14) అదృశ్య మయ్యారు. సంధ్యా రాణికి, ఆమె భర్త గణిపాక సదానందం మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య, భర్తల మధ్య గొడవతో ఈనెల 2న కూతురును తీసుకొని సంధ్యారాణి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మంగళవారం సదానందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.