త్రిగ్రాహి యోగం.. వీరికి అదృష్టం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు, సూర్యుడు, శని కుంభ రాశిలోకి ప్రవేశించడంతో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. దీని వల్ల వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభం, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉందంటున్నారు. అలాగే మిథున రాశి వారికి వ్యాపారంలో కలిసి వస్తుందని, విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉందని, కుంభ రాశి వారికి ఆర్థిక వృద్ధి కలిగి కుటుంబంలో శాంతి, సంతోషం ఉంటాయన్నారు.