బిర్యానీలో ప్రత్యక్షమైన కప్ప
హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఇష్టంగా ఫుడ్ తిందామని మెస్‌లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. చికెన్ ముక్క తిందామని అన్నంలో వేలు పెట్టగానే వారికి అనుకోని ముక్క చేతికి తగిలింది. అదేంటి విచిత్రంగా ఉందని చూడగా.. అది కప్పగా తేలింది. చికెన్ బిర్యానీలో రోస్ట్ అయిన కప్ప కనబడడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో ఉన్న కదంబ మెస్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.