మళ్లీ వివాదంలో చిక్కుకున్న యూట్యూబర్ ఇర్ఫాన్
తమిళనాడుకు చెందిన ప్రముఖ యూట్యూబర్ ఇర్ఫాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు గ్రామీణ సంక్షేమ పనులశాఖ నోటీసులు పంపింది. అతడి భార్య ప్రసవ సమయంలో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లి బిడ్డ బొడ్డు తాడును ఇర్ఫాన్ కట్ చేసే వీడియోను ఇటీవల యూట్యూబ్‌లో విడుదల చేయడంతో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి వివరణ కోరుతూ ఇర్ఫాన్‌కు రాష్ట్ర గ్రామీణ సంక్షేమ పనుల శాఖ డైరెక్టర్ రాజమూర్తి నోటీసులు పంపారు.