చిన్నారిని కాపాడిన యువకులు
భీమిలి బీచ్లో పెందుర్తి సమీపంలోని వేపగుంటకు చెందిన 12 ఏళ్ల రష్విత సముద్రంలో కొట్టుకుపోతుండగా.. బోయవీధికి చెందిన యువకులు రక్షించారు. శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. కాసరపు సతీష్, వి. సతీష్, కదిరి గౌతమ్ లు పర్యాటకులకు ఫొటోలు తీస్తుండగా రష్విత సముద్రంలో కొట్టుకుపోతుండడాన్ని గమనించారు. వేల రూపాయలు విలువగల కెమెరాలు ఒడ్డున పడేసి ప్రాణాలను రక్షించారు.