భీమిలి: స్నేహపూర్వకంగా రెవెన్యూ సేవలు
ప్రభుత్వ విధానాల మేరకు అధికారులు, ఉద్యోగులు నిజాయతీగా పని చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఉద్దేశించి విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ఆనందపురం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగిన భీమిలి రెవెన్యూ డివిజన్ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ తో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజలను కార్యాలయాలు చుట్టూ తిప్పించుకోరాదని సూచించారు.