రాష్ట్రస్థాయి సైన్స్ పెయిర్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు
శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల నంద్యాల నందు నిర్వహించిన సమితి స్థాయి (రాష్ట్ర స్థాయి ) సైన్స్ ఫెయిర్ నందు రాయదుర్గం సరస్వతీ విద్యా మందిరంలో 5వ తరగతి చదువుతున్న కె. శ్రీజన్య వాటర్ కన్జర్వేషన్, ఎస్. ప్రణీత్ చంద్రయాన్ 3, మొదటి బహుమతి అందుకున్నారు. సోమవారం వీరికి పరుచూరి రమేష్ బాబు బహుమతి ప్రధానము చేశారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించినందుకు కృషి చేసిన ప్రధాన ఆచార్యులు సి. రాజేశ్వరిని అభినందించారు.