తాడిపత్రి: తిమ్మనచెరువులో మొక్కలు నాటిన జేసీ
పెద్దపప్పూరు మండలం తిమ్మన చెరువులో జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం పర్యటించారు. తిమ్మన చెరువు కొండమీద ఉన్న శ్రీ వజ్రగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం పరిసర ప్రాంతాలలో దాదాపు 3వేలు చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే గురువారం గ్రామస్థులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులతో కలిసి జెసి ప్రభాకర్ రెడ్డి మొక్కలు నాటారు.