కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం
కుటుంబ కలహాలతో మహిళ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం పిటీఎం మండలంలో జరిగింది. మదనపల్లి తాలూకా పోలీసుల కథనం మేరకు మిట్టపల్లి కు చెందిన శకుంతల (45) కుటుంబ సభ్యులతో గొడవపడి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శకుంతలను మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి తరలించారు.