
రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల విజేత నగరం కళాశాల
నగరంలోని శ్రీ వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ కళాశాలలో గత మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు శనివారం ముగిసాయి. పోటీలలో నగరం ఎస్ వి ఆర్ ఎం కళాశాల ప్రథమ స్థానం సాధించింది. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ ద్వితీయ స్థానం సాధించగా గుంటూరు ఆర్ వి ఆర్ అండ్ జెసి కాలేజ్ తృతీయ స్థానం సాధించింది. విజేతలకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ బహుమతులను అందజేశారు.