మదనపల్లెలో జ్యూస్ అనుకొని విషద్రావణం తాగిన బాలిక
జ్యూస్ అనుకొని విష ద్రావణం తాగడంతో బాలిక తీవ్ర అస్వస్థత గురైంది. సోమవారం వాల్మీకి పురంకు చెందిన విష్ణు ప్రియ (5) ఇంట్లో ఉన్న విష ద్రావణాన్ని జ్యూస్ అనుకొని పొరపాటున తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. చిన్నారిని కుటుంబ సభ్యులు గమనించి మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. సరైన సమయంలో చికిత్స అందించడంతో బాలిక కోలుకుంటున్నదని కుటుంబీకులు తెలిపారు.