రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో దంపతులు గాయపడిన సంఘటన కురబలకోట మండలంలో ఆదివారం జరిగింది. ముదివేడు పోలీసుల కథనం మేరకు పులివెందుల మండలం బలపనూరు కు చెందిన దంపతులు శివశంకర్ (45), స్వరూప (35) అంగళ్లు లోని బంధువుల ఇంటికి వచ్చారు. తిరిగి వెళ్లే క్రమంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఓ స్కూటరిస్టు వేగంగా వచ్చి ఢీకొన్నాడు. గాయపడిన దంపతులను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.