కాకినాడ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ నుండి సర్పవరం వెళ్ళే మార్గంలో సోమవారం శుభానికేతన్ స్కూల్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బొంతు సూర్యనారాయణ (75) అక్కడికక్కడే మృతి చెందారు. కాగా సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. వాహనాన్ని వేగంగా నడిపి గుద్దడం వలన ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని కాకినాడ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు.