
కాకినాడ: అఖండ సామూహిక శ్రీరామ కోటి లిఖిత మహా యజ్ఞం
సౌగంధిక బ్రాహ్మణ మహిళా సంఘం ఆధ్వర్యంలో అఖండ సామూహిక శ్రీరామ కోటి లిఖిత మహా యజ్ఞాన్ని చేపట్టడం జరిగిందని సౌగంధిక మహిళ బ్రాహ్మణ సంఘం తెలిపింది. గురువారం కాకినాడ శ్రీ సీతారామ స్వామివారి ఆలయంలో సౌగంధిక బ్రాహ్మణ మహిళా సంఘం అధ్యక్షురాలు బాలాంత్రపు సుచిత్ర అధ్యక్షతన శ్రీ సీతారామ స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మెట్ట రాధా, పసరకొండ సుభద్రా దేవి పాల్గొన్నారు.