మండపేట: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ళ
పేద విద్యార్థుల కడుపునింపుటకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు పరచిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మండపేట పట్టణంలో ఏడిది రోడ్డులో గల వేగుళ్ళ సూర్యారావు జూనియర్ కాలేజీలో రాష్ట్ర ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డొక్కా సీతమ్మ పేరు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం గర్వకారణమని అన్నారు.