కొవ్వూరు: తిరుపతిలో తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యమే
తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం ఎంతో బాధాకరమని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే తానేటి వనితా గురువారం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అవకుండా పట్టిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి టికెట్ల బుకింగ్‌లో నూతన టెక్నాలజీ విధానాన్ని అమలు చేయాలన్నారు.