మలికిపురం: వంతెనపై పొంచి ఉన్న ప్రమాదం
మలికిపురం మండలం లక్కవరం సెంటర్లో చింతలపల్లి మెయిన్ ఛానల్ పై బట్టేలంక వెళ్లే రోడ్డులో వంతెనను వెడల్పు చేశారు. అయితే ఆ వంతెనకు కాలువ వైపు రక్షణ గోడ నిర్మించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని లక్కవరం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రుద్రరాజు గోపాల కృష్ణరాజు అన్నారు. ఆర్&బీ అధికారులు స్పందించి తక్షణమే వంతెనపై రక్షణ గోడ నిర్మించాలని శుక్రవారం ఆయన కోరారు.