
కుడిపూడి ఆధ్వర్యములో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రులను ఆకర్షిస్తూ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కోసం బుధవారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్తిబాబు ముఖ్య అతిథులుగా హాజరై కరప, వలసపాకల, ఇతర గ్రామాలలో ప్రచారం నిర్వహించారు.