
ఆకివీడు; మహాశివరాత్రి సందడి
ఆకివీడు మండలం మాదివాడ శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం మహాశివరాత్రి పండుగ సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి వేకువజామున విశేష పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.