రేపు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు. రేపు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు గుంటూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు కూడా జనసేనలో జాయిన్ కానున్నారు. కిలారి రోశయ్య 2019లో పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.