వరద బాధితులకు దుస్తుల పంపిణీ
తుళ్లూరు మండల పరిధిలోని ఉద్దండ్రాయునిపాలెం లంక గ్రామానికి చెందిన వారికి అమరావతి మహిళ జేఏసీ నేత శైలజ, జేఏసీ నేత చిన్న, రాయపూడి శైలజ గురువారం దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఓ చర్చిలో పునరావాసం లో ఉన్న వరద బాధితులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుందని వారు భరోసా కల్పించారు.