ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని పర్యవేక్షించిన వైద్యాధికారులు
కడప జిల్లా మైలవరం మండలం వద్దిరాల జంగం కాలనీలో శుక్రవారం ఫ్రైడే- డ్రైడే కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు, జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శాంతికళ, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించి జ్వర అనుమానితులకు పరీక్షలు చేశారు. వారికి తగు మందులిచ్చారు. ప్రజలకు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతలపై సూచనలిచ్చారు.