15న రాజమండ్రిలో అథ్లెటిక్స్ జిల్లా జట్టు ఎంపిక
తూ. గో జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 15న రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో అథ్లెటిక్స్ జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు సంఘ కార్యదర్శి ఎన్. శివ గురువారం పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను అక్టోబర్ లో గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9177771287లో సంప్రదించాలని సూచించారు.