విజయవాడలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రచారం
విజయవాడ సెంట్రల్లో తెలంగాణకు చెందిన టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొణిజేటి ఆదినారాయణ ఎన్నికల ప్రచారం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలంగాణ ఓటర్లు ఉన్నారన్నారు. తెలంగాణని కెసిఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని తెలిపారు. విజయవాడలో అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు.