గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తేనే బిల్లులు
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కొరకు మంజూరు చేసిన గృహ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభిస్తేనే లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని ఆలూరు హౌసింగ్ డిఈ ఆదినారాయణ అన్నారు. గురువారం ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల పరిధిలోని నంచర్ల గ్రామంలోని హౌసింగ్ కాలనీ నందు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను హౌసింగ్ డిఈ ఆదినారాయణ పరిశీలించారు. నిర్మాణ పనులను లబ్ధిదారులు తక్షణమే ప్రారంభించాలని ఆయన తెలిపారు.