ప్రతి ఒక్కరికీ శాస్త్రీయ విజ్ఞానం అవసరం
విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించే ఉద్దేశ్యంతో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు ఈ సంవత్సరం కూడా జరగనున్నాయని కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జనవిజ్ఞాన వేదిక నాయకులు నరసింహారెడ్డి కోరారు. ప్యాపిలి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీల గోడ పత్రికలు బుధవారం ఆవిష్కరణ చేశారు.