
బేతంచెర్ల: లారీ డ్రైవర్ మృతి
బేతంచెర్ల మండల లారీ వర్కర్స్ యూనియన్ నాయకుడు ఎ. మాదన్న (47) కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఈయన మృతి పట్ల యూనియన్ నాయకులు, బంధుమిత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన భార్య వెంకటేశ్వరమ్మకు 10 వేలు రూపాయలును, యూనియన్ నిధినుండి యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వై.ఎల్లయ్య, వై.వెంకటేశ్వర్లు అందజేశారు.