బొబ్బిలి: ప్రదర్శనలకు సిద్దం అవుతోన్న బొంతలకోటి
ఉత్తరాంధ్రలో భాగవత ప్రదర్శనలకు పేరు గాంచారు బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామానికి చెందిన బొంతలకోటి వంశీయులు. గ్రామాల్లో జరిగే గ్రామ దేవత పండుగలో సోమవారం రాత్రి తప్పనిసరిగా బొంతల కోటి వారి భాగవత ప్రదర్శన తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనే ఆచారం నేటికీ కొనసాగుతూ వస్తుందని భాగవత కళాకారులు శంకరరావు తెలిపారు. మంగళవారం ఆయన బొబ్బిలిలో మాట్లాడుతూ.. బొంతల కోటి వంశంలో 13 తరాలుగా ఈ ప్రదర్శనను కొనసాగిస్తూ వస్తున్నామని తెలిపారు.