
బొబ్బిలి: మున్సిపాలిటీలో ఆస్తి పన్నుపై వడ్డీలో 50 శాతం రాయితీ
బొబ్బిలి మున్సిపాలిటీలో పన్నులు వసూలు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి కోరారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్, సచివాలయ ఉద్యోగులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరులోగా పన్నులు చెల్లిస్తే 50 శాతం వడ్డీ రాయితీ వస్తుందన్నారు. ఇంటింటికి వెళ్లి ఆస్తి పన్ను, కుళాయి, ఖాళీ స్థలాల పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. పన్నులు వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు