కొనకనమిట్ల: రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే
మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గురువారం కొనకనమిట్ల మండలం గార్ల దీన్నే గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. భూ సమస్యలపై రైతులు ఇచ్చిన అర్జీలను ఆయన పరిశీలించారు. రైతులు ఇస్తున్న అర్జీలను తక్షణమే అధికారులు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కూటమి ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.