ప్రకాశం జిల్లాకు వర్ష సూచన
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో గురువారం నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడప జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కృష్ణా తదితర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.