మార్కాపురం: మద్యం షాపులో చోరీ
మార్కాపురం ఆర్టీసీ డిపో సమీపంలోని డిఎస్ఆర్ వైన్ షాపులో మంగళవారం అర్థరాత్రి చోరీ జరిగింది. వైన్ షాపు వెనుక వైపు నుండి ఇనుప పైప్ సహాయంతో షాప్ లోకి దిగి సుమారు 50 వేల విలువ చేసే పుల్ బాటిళ్లను షాపు వెనుక వైపు నుండి దొంగలించుకెళ్లారు. షాప్ లోని సీసీ కెమెరాల వైర్లను కత్తిరించారు. బుధవారం వైన్ షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.