2 రోజుల పాటు బస్సు పాస్ ల జారీ నిలిపివేత
ప్రకాశం జిల్లా, మార్కాపురం ఏపీఎస్ఆర్టీసీ డిపో పరిధిలో బస్సు పాస్ ల జారీ 2 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు మేనేజర్ నరసింహులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బస్సు పాస్ సంబంధిత సాఫ్ట్వేర్ అప్డేట్ జరుగుతుందని అక్టోబర్ 5, 6వ తేదీలలో బస్సు పాసులు ఇవ్వడం నిలిపివేశామన్నారు. 7వ తేదీ నుంచి బస్సు పాసులను యధావిధిగా ఇవ్వడం జరుగుతుందని ఈ విషయాన్ని విద్యార్థులు, ప్రయాణికులు గమనించాలని నరసింహులు విజ్ఞప్తి చేశారు.