
మార్కాపురం: కిడ్నీ ఇన్ఫెక్షన్ బాధితుడికి ఆర్థికసాయం
మార్కాపురం పట్టణంలోని వడ్డే బజార్ లో లింగాల నాగరాజు అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత కొద్దిరోజులుగా నాగరాజు కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూన్నాడు. అతడు గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. అతని వైద్య ఖర్చుల నిమిత్తం మానవతా ఫౌండర్ ఎన్. రామచంద్రారెడ్డి సహకారంతో బుధవారం రూ. 46,500లను అందజేశారు.