జమ్మలమడుగు: అనాథరైజ్డ్ పొదుపు వివోపై చర్యలు తీసుకోవాలి
జమ్మలమడుగు మండలం పూర్వ బొమ్మేపల్లిలోని కన్నెలూరు లక్ష్మీదేవి మంగళవారం పలు సమస్యలపై కడప పీడీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. పూర్వ బొమ్మేపల్లి పంచాయతీ బీ. ఆర్ కొట్టాల గ్రామ పొదుపు సంఘంలో వీవోఏ లేదని అక్కడ అనాథరైజ్డ్ మహిళతో పని చేస్తున్నారని తెలిపారు. ఆ మహిళపై గతంలో పలు ఆరోపణలు ఉన్నాయని, గ్రామ సంఘం నిధులు దుర్వినియోగం జరిగాయని తెలిపారు.