
నెల్లూరు: వక్ఫ్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఆందోళన
వక్ఫ్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఈనెల 17 సోమవారం నెల్లూరులోని యూసుఫియా మస్జిద్ వద్ద నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఉదయం 11 గంటలకు ముస్లిం మైనార్టీలు భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు మైనార్టీ నేత సయ్యద్ సమీ పేర్కొన్నారు. శనివారం నెల్లూరులో ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ముస్లింల ఆస్తులను ప్రతి ఒక్కరు పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. వేలాదిగా ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.