ఆదోని: మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యుల ఆగ్రహం
ఆదోని మున్సిపల్ కౌన్సిల్లో పాలకవర్గ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు నిబంధనలు ఒకేలా ఉండాలని, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఎలా ఉంటాయని శనివారం ఆదోనిలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు, కౌన్సిలర్ సందీప్ రెడ్డి, కౌన్సిలర్ బాలాజీ అధికారులను నిలదీశారు. అసలు ఏమి జరుగుతుందో పాలకవర్గ సభ్యులకు తెలియడంలేదన్నారు. మెజార్టీగా ఉన్న వైసీపీ కౌన్సిలర్లకు అధికారులు సమాచారాన్ని ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు.