అనంత జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకును బొలెరో వాహనం ఢీ కొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. బొలెరో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.