దుత్తలూరు: విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి
జిల్లాలోని దుత్తలూరు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు జరుగుతున్న 4 డిఎస్ స్క్రీనింగ్ పరీక్షలను జిల్లా ఉప వైద్యాధికారిని పి. బ్రిజిత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నతనంలో వచ్చే పౌష్టిక లోపాలు పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని, విద్యార్థులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు. విద్యార్థుల ఎత్తు, బరువు, బ్లడ్ గ్రూప్ వివరాలు సేకరించారు.