ఉదయగిరి: ఆత్మీయ సమావేశం వాయిదా
అతి భారీ వర్షాల కారణంగా వింజమూరు ఏస్వీ కన్వెన్షన్ హాల్ లో మంగళవారం ఉదయం జరగాల్సిన ఆత్మీయ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని నాయకులు, కార్యకర్తలు అందరికి తెలియజేయాలని సూచించింది. త్వరలో సమావేశానికి సంబంధించి మరో తేదీని ప్రకటిస్తామన్నారు.