అక్రమ మద్యంతో పట్టుబడిన వ్యక్తికి రిమాండ్
పాతపట్నం మండలంలోని కొరసవాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్రమంగా మద్యం తరలిస్తుండటంతో పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి అరెస్టు చేసినట్లు పాతపట్నం ఎస్.ఐ బి. లావణ్య శుక్రవారం తెలిపారు. ఈ దాడుల్లో 93 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ రూ.16500 ఉన్నట్లు చెప్పారు. పట్టబడిన నిందితున్ని కోర్టులో హాజరుపర్చగా మెజిస్ట్రేట్ రిమాండ్ కు ఆదేశించినట్లు వెల్లడించారు.