జమ్మలమడుగులో 22 మంది పేకాట రాయుళ్ల అరెస్టు
జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధి ఈడిగ పేటలో ఆదివారం రాత్రి 22 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్లు అర్బన్ సీఐ లింగప్ప తెలిపారు. సోమవారం సీఐ వివరాలు మేరకు రాబడిన సమాచారం మేరకు వెంటనే పేకాట స్థావరo పై తమ సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నామన్నారు. పట్టుబడిన 22 మందిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి వారి నుంచి రూ. 1, 20, 600 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.