పులివెందుల: ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయాలి
గతంలో మాదిరిగానే ఇంటింటికి రేషన్ పంపిణీచేయాలని, రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టాలని మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ చిన్నప్ప, వైసీపీ పట్టణ కన్వీనర్ హాలు గంగాధర్ రెడ్డిలు ఆర్డీఓ చిన్నయ్యను కోరారు. శుక్రవారం పులివెందుల పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న ఆర్డీవో చిన్నయను కలిశారు. అనంతరం వారు వినతి పత్రం అందించారు. పులివెందుల వైకాపా నాయకులు పాల్గొన్నారు.