అక్టోబర్ 2 స్వచ్ఛ భారత్ దినోత్సవం
స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 2 వరకు మన్యం జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవ 2024 నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ, స్వచ్ఛతను జీవన విధానంగా మార్చుకునేలా సమష్టిగా ముందడుగు వేయవలసిన అవశ్యకత ఉందన్నారు. జిల్లా స్ధాయిలో భాగస్వామ్య సంస్ధలతో ఇప్పటికే ఉన్నత స్ధాయి సన్నాహక సమావేశం నిర్వహించారు.