గుర్తు తెలియని మృతదేహం లభ్యం
చీపురుపల్లి ఆర్డివో కార్యాలయ సమీపంలో కొండ గెడ్డలో శుక్రవారం గుర్తు తెలియని మృతి దేహం లభ్యమైంది. ఆవుల కాపరుల సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ కిరణ్ నాయుడు సంఘటన స్థలానికి చేరుకుని మృతిదేహాన్ని పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోవడంతో ఆచూకీ గుర్తు పట్టలేని పరిస్థితి నెలకొంది. ఇది హల్యానా లేక ఆత్మహత్యానా అన్నది తెలియాల్సి ఉంది. ఈఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.