నేడు ఉత్తరాంధ్రలో వర్షాలు
ఉత్తరాంధ్ర జిల్లాలో మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుందని అధికారులు వెల్లడించారు.